Vijay Thalapathy: విజయ్ కెరీర్ లో చివరి సినిమా...“జన నాయగన్” 3 d ago

ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్దే అలానే మమిత బైజు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రమే “జన నాయగన్”. విజయ్ కెరీర్ లో చివరి సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇపుడు చాల వేగంగా పూర్తవుతుంది. విజయ్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉండడంతో దర్శకుడు హెచ్ వినోద్ అండ్ టీం ఈ సినిమాని మరింత త్వరగా పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఈ సినిమా ఓటిటి హక్కులపై సాలిడ్ సమాచారం ఇప్పుడు వినిపిస్తుంది. ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఏకంగా 121 కోట్లు ఇచ్చి జన నాయగన్ పాన్ ఇండియా ఓటిటి హక్కులు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.